అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medaram Sammakka Sarakka Jathara | మేడారంలో నేడు (ఆదివారం, ఈ నెల 18వ తేదీ) సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం ఉంటుంది. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా మేడారంలో తొలిసారి క్యాబినెట్ మీటింగ్ (cabinet meeting) నిర్వహించబోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహా జాతరను (Medaram Maha Jatara) ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు అభివృద్ధి పనులు చేపట్టింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలను పునర్ నిర్మించింది. ఆయా పనులను ప్రారంభించడానికి సీఎం రేవంత్‌రెడ్డి నేడు ఈ నెల 18న మేడారం చేరుకుంటారు. అక్కడ మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు. రాత్రి అక్కడే బస చేసి 19న అమ్మవారి గద్దెలను సీఎం ప్రారంభిస్తారు. మేడారంలో కాకతీయుల నాటి కళా వైభవం ఉట్టిపడేలా రాతి కట్టడాలతో గద్దెల తోరణాలను నిర్మించారు.
Medaram Sammakka Sarakka Jathara | పాలేరులో పర్యటన
పాలేరు నియోజకవర్గంలో రూ.362 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఈ నెల 18న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనికితోడు మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం ఉంటుంది. మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభిస్తారు. కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.