అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. నగర శివారులో తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Collector Nizamabad | బోధన్ రోడ్లో..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్న వాటిలో నగరంలోని బోధన్ రోడ్డు ఎన్ఎన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ప్రాంతం రాష్ట్రంలోనే 20వ స్థానంలో ఉందన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రమాదాల నివారణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లో రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు జరిపించాలని ఆర్అండ్బీ, పోలీస్ అధికారులకు (R&B and police officials) సూచించారు. రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలన్నారు.
Collector Nizamabad | బ్లాక్స్పాట్లను గుర్తించిన ప్రదేశాల్లో..
మాణిక్ బండార్ సమీపంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించిన ప్రదేశాల్లో ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలన్నారు. మూలమలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి వాటిని సరి చేయాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
Collector Nizamabad | ఆర్టీసీ, ప్రైవేట్ వాహనదారులకు అవగాహన
ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల ఆపరేటర్లకు, డ్రైవర్లకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వా రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఎంవీఐ శ్రీనివాస్, ఆర్అండ్బీ అధికారి ప్రవీణ్ తదితరులున్నారు.