అక్షరటుడే, ఇందూరు: MP Arvind | ఈసారి మేయర్ పీఠం బీజేపీదేనని ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) భాగంగా నగరంలోని 5వ డివిజన్ పరిధిలోని ఆర్యనగర్, బోర్గాం(పి) ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి యాదాల నరేష్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
MP Arvind | నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
గతంలో కొద్దిలో మేయర్ పీఠం చేజారిందన్నారు. తన సహకారంతో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో కొట్లాడి మరీ నిధులు సమీకరిస్తున్నారన్నారు. దీంట్లో భాగంగానే డివిజన్‌కు రూ.కోటి వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించాలన్నారు.
ప్రతి డివిజన్‌పై ప్రత్యేక శ్రద్ధ..
నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రతి డివిజన్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని ఎంపీ అన్నారు. దీంట్లో భాగంగానే ప్రతి సమస్యను ఇప్పటికే నోట్ చేసుకున్నామని.. నగరాభివృద్ధికి ఎంపీగా నాతో సహా ఎమ్మెల్యే ధన్పాల్ కట్టుబడి ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు. నగరంలో ఎక్కువ సంఖ్యలో బీజేపీ కార్పొరేటర్లను గెలిపించుకుంటే మేయర్ పీఠం కైవసం చేసుకోవచ్చని తద్వారా నగరంలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

2 comments
[…] PM Modi on Rajya Sabha | కాంగ్రెస్‌పై ప్రధాని… MP Arvind | మేయర్ పీఠం బీజేపీదే..: ఎంపీ అర్వి… Neeta Arjun Rathod | 34వ డివిజన్‌ను ఆదర్శంగా […]
[…] PM Modi on Rajya Sabha | కాంగ్రెస్‌పై ప్రధాని… MP Arvind | మేయర్ పీఠం బీజేపీదే..: ఎంపీ అర్వి… Neeta Arjun Rathod | 34వ డివిజన్‌ను ఆదర్శంగా […]
Comments are closed.