అక్షరటుడే, ఇందూరు: Neeta Arjun Rathod | తనను గెలిపిస్తే 34వ డివిజన్‌ను (34th division) నగరంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిని గీతా అర్జున్ రాథోడ్ (Neeta Arjun Rathod) అన్నారు. ఈ మేరకు గురువారం డివిజన్లోని పలు కాలనీల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
Neeta Arjun Rathod | డివిజన్ ప్రజలకు అండగా ఉంటాం
తనను గెలిపిస్తే డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా సేవచేస్తూ వారికి అండగా నిలుస్తామని గీతా అర్జున్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా కాలనీల్లో ప్రజలతో మాట్లాడారు. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. డివిజన్లోని అనేక కాలనీలో రోడ్లు, డ్రెయినేజీల అవసరం ఉందని.. ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తామని ఆమె పేర్కొన్నారు.
Neeta Arjun Rathod | డివిజన్‌కు నిధులు తీసుకొస్తా..
డివిజన్‌కు రావాల్సిన నిధులను కొట్లాడి తీసుకొస్తానని.. ఆ నిధులతో ప్రతి కాలనీల్లో రోడ్లు వేయిస్తానని.. తద్వారా రవాణా సౌకర్యాన్ని మెరుగు పరుస్తామని రాథోడ్ తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రూ.కోట్ల నిధులతో నగరాభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.