Homeజిల్లాలుకామారెడ్డిTahsildars Transfers | భారీగా తహశీల్దార్ల బదిలీ

Tahsildars Transfers | భారీగా తహశీల్దార్ల బదిలీ

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Tahsildars Transfers | కామారెడ్డి జిల్లాలో భారీగా రెవెన్యూ అధికారులు, తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఉత్తర్వులు జారీ చేశారు. సదాశివనగర్ (Sadashivnagar) తహశీల్దార్ గంగాసాగర్ బీబీపేటకు బదిలీ కాగా.. అక్కడ పనిచేస్తున్న తహశీల్దార్ సత్యనారాయణ సదాశివనగర్​కు వెళ్లారు. తాడ్వాయి (Tadwai) తహశీల్దార్​గా మాచారెడ్డి (machareddy) తహశీల్దార్ శ్వేత, భిక్కనూరు(Bhiknoor) తహశీల్దార్ శివప్రసాద్ ఆర్డీవో కామారెడ్డి కార్యాలయం డీఏవోగా బదిలీ అయ్యారు.

కామారెడ్డి ఆర్డీవో కార్యాలయ డీఏవో సునీత భిక్కనూరు తహశీల్దార్​గా ట్రాన్స్​ఫర్​ అయ్యారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్​​ సరళను మాచారెడ్డి తహశీల్దార్​గా బదిలీ చేశారు. నస్రుల్లాబాద్ (Nasrullabad)​ తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ డొంగ్లీకి, బాన్సువాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ డీఏవో సువర్ణ నస్రుల్లాబాద్​ తహశీల్దార్​గా నియమితులయ్యారు. డొంగ్లీ తహశీల్దార్ అనిల్ కుమార్​ను బాన్సువాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ డీఏవోగా నియమించగా కలెక్టరేట్ సూపరింటెండెంట్​ సుధాకర్​ను దోమకొండ తహశీల్దార్​గా నియమించారు. ఆర్డీవో కార్యాలయ నాయబ్ తహశీల్దార్ లక్ష్మణ్​ను గాంధారి తహశీల్దార్​ కార్యాలయానికి, కామారెడ్డి డీసీఎస్​వో కిష్టయ్యను రామారెడ్డి తహశీల్దార్ కార్యాలయానికి డిప్యుటేషన్​పై పంపిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Must Read
Related News