అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా ఐపీఎస్ అధికారులను (IPS officers) బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Chief Secretary Ramakrishna Rao) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Municipal elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చోటు చేసుకోవడం గమనార్హం. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా (Joint Commissioner of Cyberabad Traffic) కొనసాగుతున్న గజారావు భూపాల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొవిజనింగ్, లాజిస్టిక్స్‌గా నియమితులయ్యారు. నార్కోటిక్స్ యాంటీ బ్యూరోలో డీఐజీగా పని చేస్తున్న అభిషేక్ మొహంతి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇంటెలిజెన్స్ సీఐ సెల్లో ఎస్పీగా పని చేస్తున్న భాస్కరన్ ఇంటెలిజెన్స్ డీఐజీగా బదిలీ అయ్యారు.
రైల్వే డీఐజీగా పనిచేస్తున్న చందన దీప్తి ఫ్యూచర్ సిటీ పరిపాలన, ట్రాఫిక్ సీపీగా స్థానచలనం పొందారు. విజిలెన్స్‌లో పని చేస్తున్న అన్నపూర్ణ సైబరాబాద్ DCPగా బదిలీ అయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా పని చేస్తున్న రాహుల్ హెగ్డే, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్-III జోన్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎస్బీలో పని చేస్తున్న అపూర్వరావు, ఇంటెలిజెన్స్ విభాగానికి, ఈస్ట్ జోన్ డీసీపీ బాల స్వామి, అన్నపూర్ణ స్థానంలో విజిలెన్స్‌లో నియమితులయ్యారు.
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–3 డీసీపీ వెంకటేశ్వర్లు సీఐడీకి, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ హైదరాబాద్ సిటీ డీసీపీగా బదిలీ అయ్యారు. కొత్తగూడెం అదనపు ఎస్పీగా కొనసాగుతున్న అవినాష్ కుమార్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్-I డీసీపీగా రానున్నారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ హైదరాబాద్ ట్రాఫిక్–2 డీసీపీగా, జగిత్యాల అదనపు ఎస్పీ (అడ్మిన్) శేషాద్రిని రెడ్డి సైబరాబాద్ కమిషనరేట్ లో ట్రాఫిక్-IIకు డీసీపీగా బదిలీ అయ్యారు. కంకణాల రాహుల్ రెడ్డి భువనగిరి డీసీపీ నుంచి మాల్కాజ్‌గిరి ట్రాఫిక్–1 జోన్‌కు, శివం ఉపాధ్యాయ ములుగు హెడ్ క్వార్టర్స్ నుంచి ట్రాఫిక్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు.
సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, సైబరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్-Iకు, మల్కాజ్గిరి కమిషనరేట్‌లో పని చేస్తున్న డీసీపీ శ్యామ్ సుందర్‌ను హైదరాబాద్ సిటీ డీసీపీగా నియమించారు. హైదరాబాద్ నార్త్ జోన్, అదనపు డీసీపీ అశోక్, విజిలెన్స్ అదనపు ఎస్పీగా, అక్కడ పని చేస్తున్న బాలకొటిని హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.