HomeతెలంగాణMunicipal Commissioners Transfer | భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ

Municipal Commissioners Transfer | భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Municipal Commissioners Transfer | రాష్ట్రంలో బదిలీల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం ఇటీవల ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఎస్సైలు, సీఐలు, తహశీల్దార్ల బదిలీలు కూడా చేపట్టింది. తాజాగా పెద్ద ఎత్తున మున్సిపల్​ కమిషనర్లను ట్రాన్స్​ఫర్(Municipal Commissioners Transfer)​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 129 మంది మున్సిపల్​ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ కార్యదర్శి డాక్టర్‌ టీకే శ్రీదేవి(Municipal Secretary Dr. TK Sridevi) ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. మున్సిపల్​ కమిషనర్లలో పలువురికి ప్రమోషన్లు సైతం కల్పించారు.

Municipal Commissioners Transfer | స్థానిక ఎన్నికల కోసమేనా..

రాష్ట్రంలో కొంతకాలంగా అధికారుల బదిలీలు చేపడుతున్నారు. పోలీస్​ శాఖలో కానిస్టేబుళ్ల నుంచి మొదలు పెడితే ఐపీఎస్​ అధికారుల వరకు బదిలీలు చేపట్టారు. సోమవారం సైతం మల్టీ జోన్​ –1 పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేశారు. అలాగే తహశీల్దార్లు, ఐఏఎస్ అధికారులను సైతం ట్రాన్స్​ఫర్​ చేశారు. తాజాగా భారీ మొత్తంలో మున్సిపల్​ కమిషనర్లకు స్థాన చలనం కలిగించారు. అయితే రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధికారుల బదిలీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.