అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో చలితీవ్రత తగ్గింది. మరి కొన్ని రోజుల్లో ఎండాకాలం మొదలు కానుంది. అయితే ఈ ఏడాది ఎండలు దంచికొట్టనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు.
దేశవ్యాప్తంగా వర్షాకాలంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. తెలంగాణ (Telangana)లో వరదలు ముంచెత్తాయి. శీతాకాలంలో సైతం కోల్డ్వేవ్లతో ప్రజలు వణికిపోయారు. మొన్నటి వరకు చలి పంజా విసిరింది. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోయారు. ప్రస్తుతం చలితీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో ఎండలు సైతం దంచికొట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
Weather Updates | వర్షసూచన
ఎండాకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి ఎండాకాలం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 తర్వత, మార్చి, ఏప్రిల్ నెలల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణ ఎండాకాలం ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు అవుతాయి. అయితే వేసవి రెండో భాగంలో ఎండలు దంచి కొట్టనున్నాయి. మే, జూన్ నెలల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. 2023లాగే ఈ ఏడాది సైతం ఎండలు మండనున్నాయి. అలాగే రుతుపవనాలు సైతం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుపాన్ (Storm)ల కారణంగా వేడిగాలులు వీస్తాయి.