అక్షరటుడే, వెబ్డెస్క్ : Bangladesh | బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొరైల్ మురికివాడ (Korail Slum)లో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. మంటలు అంటుకొని దాదాపు 1500 గుడిసెలు కాలిపోయాయి.
ఢాకా (Dhaka)లోని అతిపెద్ద మురికివాడల్లో కొరైల్ ప్రాంతం ఒకటి. మంగళవారం రాత్రి మంటలు అంటుకొని అగ్ని ప్రమాదం జరిగింది. భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident)తో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తగరపు పైకప్పు గల గుడిసెల వరుసలు కాలిపోయిన శిథిలాలుగా మారాయని అధికారులు తెలిపారు.
Bangladesh | 80 వేల మంది నివాసం
ఈ ప్రాంతంలో దాదాపు 80 వేల మంది నివాసం ఉంటారు. గుల్షన్, బనాని పరిసరాల మధ్య ఈ మురికి వాడ ఉంది. చుట్టూ ఉన్నత స్థాయి అపార్ట్‌మెంట్ టవర్ల సమూహాలు ఉన్నాయి. రాత్రిపూట ఆకాశంలోకి నారింజ రంగు మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజలు గుడిసెల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. తమకు కావాల్సిన వస్తువులను తీసుకొని బయటకు వెళ్లారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 19 ఫైరింజన్లతో మంటలను ఆర్పి వేశారు. మంగళవారం రాత్రి చెలరేగిన మంటలు బుధవారం అదుపులోకి వచ్చాయి.
Bangladesh | కట్టుబట్టలతో..
భారీ అగ్ని ప్రమాదంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. తమ సామగ్రి అంతా కాలిపోయిందని, ఇప్పుడు ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
