Kolkata | కోల్​కతా హోటల్లో భారీ అగ్ని ప్రమాదం..14 మంది సజీవ దహనం
Kolkata | కోల్​కతా హోటల్లో భారీ అగ్ని ప్రమాదం..14 మంది సజీవ దహనం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kolkata | కోల్​కతాలోని మెచువాపట్టి ప్రాంతంలో ఉన్న హోటల్ లో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం(Fire accident) సంభవించింది. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం అయినట్లు సీపీ మనోజ్ వర్మ(CP Manoj Verma)Kolkata’ తెలిపారు. ప్రాణ భయంతో కొందరు కిటికీల్లో నుంచి దూకే ప్రయత్నం చేశారు. భవనంలోని నాలుగో అంతస్తులో నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి.

మరణించిన వారిలో 11 మంది పురుషులు, ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మంగళవారం రాత్రి 8 గంటల 20 నిమిషాలకు ఆరంతస్తుల భవనంలో మంటలు రేగాయి. దీంతో పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. 10 అగ్ని మాపక వాహనాలు తీవ్రంగా శ్రమించి బుధవారం వేకువజామున 3.30 గంటలకు మంటల అదుపులోకి తెచ్చాయి.