అక్షరటుడే, న్యూఢిల్లీ: Domestic Automobile | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ(Maruti Suzuki) మరో మైలురాయిని చేరుకుంది.
మార్కెట్ క్యాపిటలైజేషన్(Market capitalization) పరంగా ప్రపంచంలో అత్యంత విలువైన టాప్-10 వాహన తయారీ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది.
సుమారు 57.6 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఫోర్డ్(Ford), జనరల్ మోటార్స్, వోక్స్‌వ్యాగన్‌లను వెనక్కి నెట్టేసింది.
దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ బడ్జెట్ కార్ల తయారీతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణను చూరగొంది. దీని మార్కెట్ విలువ పెరగడానికి అనేక కారణాలున్నాయి.
ప్రధానంగా జీఎస్టీ సంస్కరణలు(GST reforms) ఈ ఘనత సాధించడానికి దోహదపడ్డాయని భావిస్తున్నారు. తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కార్లపై జీఎస్టీని 10 శాతం వరకు తగ్గించిన విషయం తెలిసిందే.
దీంతో ఈ కంపెనీకి చెందిన ఆల్టో(Alto), ఎస్ ప్రెస్సో, వ్యాగన్‌ఆర్ వంటి మోడళ్లకు మరింత డిమాండ్ ఏర్పడిరది. సామాన్యులకు సైతం అందుబాటు ధరలో లభిస్తుండడంతో ఇటీవల కొత్త కార్ల విక్రయాలు పెరిగాయి. ఎక్కువమంది వినియోగదారులు మారుతి సుజుకీ కార్లను బుక్ చేసుకున్నారు. దీంతో కంపెనీ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది.
Domestic Automobile | టాప్‌లో టెస్లా..
టాప్ టాప్-10 వాహన తయారీ కంపెనీల జాబితాలో టెస్లా(Tesla) అగ్రస్థానంలో కొనసాగుతోంది. దాని మార్కెట్ విలువ 1.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 314 బిలియన్ డాలర్లతో టయోటా రెండో స్థానంలో ఉండగా.. 134 బిలియన్ డాలర్లతో బీవైడీ మూడో స్థానంలో ఉంది.
ఫెరారీ 92.7 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో, బీఎండబ్ల్యూ(BMW) 61.3 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో, మెర్సిడెస్ బెంజ్ 59.8 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో, హోండా 59 బిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో ఉన్నాయి.
57.6 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో మారుతి సుజుకీ ఎనిమిదో స్థానానికి ఎగబాకగా 57.1 బిలియన్ డాలర్లతో జనరల్ మోటార్స్(GM) తొమ్మిదో స్థానంలో, 55.7 బిలియన్ డాలర్లతో వోక్స్‌వ్యాగన్ పదో స్థానంలో ఉన్నాయి. మారుతి వేగంగా దూసుకురావడంతో ఫోర్డ్(46.3 బిలియన్ డాలర్లు) పదకొండో స్థానానికి పడిపోయింది.