అక్షరటుడే, పెద్దకొడప్గల్ : Peddakodapgal Mandal | మండలంలోని కాటేపల్లి గ్రామానికి (Katepalli Village) చెందిన వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటేపల్లి గ్రామానికి చెందిన సోంపేట్ తులసి (25) తన భర్త రాందాస్ వేధింపులు భరించలేక సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఏడాది కాలంగా భర్త ఆమెతో తరచూ గొడవ పడుతుండేవాడని.. దీంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై అరుణ్ కుమార్ (SI Arun Kumar) ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి రుక్కవ్వ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
