అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Markets) కొద్దిసేపటికే కోలుకుని లాభాల బాట పట్టాయి. ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్ 538 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 26 వేల పాయింట్లపైన ట్రేడ్ అవుతోంది.
ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు గురువారం ఉదయం బలహీనంగా ప్రారంభమైనా.. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో పుంజుకున్నాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడిరది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలకు తోడు రూపాయి బలహీనత ఐటీ షేర్లకు బూస్ట్ ఇచ్చింది. ఉదయం సెన్సెక్స్ 119 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 38 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 538 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 5 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై మరో 43 62 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 160 పాయింట్లు లాభపడిరది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 260 పాయింట్ల లాభంతో 85,367 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 26,070 వద్ద ఉన్నాయి.
ఐటీలో జోరు..
బీఎస్‌ఈ(BSE)లో ఐటీ ఇండెక్స్ జోరు మీదుంది. ఐటీ ఇండెక్స్ 1.40 శాతం పెరగ్గా.. మెటల్ 0.71 శాతం, కమోడిటీ 0.57 శాతం, ఎనర్జీ 0.50 శాతం, ఆటో 0.42 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.38 శాతం లాభాలతో ఉన్నాయి. సర్వీసెస్ ఇండెక్స్ 0.26, టెలికాం 0.22 శాతం, హెల్త్‌కేర్, పవర్ ఇండెక్స్‌లు 0.03 శాతం నష్టాలతో ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.36 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.24 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 21 కంపెనీలు లాభాలతో ఉండగా.. 9 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టీసీఎస్ 1.87 శాతం, టెక్ మహీంద్రా 1.67 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.51 శాతం, రిలయన్స్ 1.33 శాతం, ఇన్ఫోసిస్ 0.97 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎటర్నల్ 1.43 శాతం, మారుతి 0.59 శాతం, కొటక్ బ్యాంక్ 0.52 శాతం, ఎస్‌బీఐ 0.49 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.44 శాతం నష్టాలతో ఉన్నాయి.
