Homeబిజినెస్​Stock Market | పైపైకి మార్కెట్లు.. 84 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

Stock Market | పైపైకి మార్కెట్లు.. 84 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

భారత స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్లన్నీ నెగెటివ్‌గా ఉన్నా.. మన సెన్సెక్స్‌, నిఫ్టీలు మాత్రం పాజిటివ్​గా ట్రేడ్​ అవుతున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market)లో బుల్‌ జోరు కొనసాగుతోంది. గ్లోబల్‌ మార్కెట్లన్నీ నెగెటివ్‌గా ఉన్నా.. మన సెన్సెక్స్‌, నిఫ్టీలు మాత్రం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.

గ్లోబల్‌ మార్కెట్లు(Global Markets) ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన మార్కెట్లు పాజిటివ్‌గా సాగుతున్నాయి. కంపెనీల క్యూ2 ఎర్నింగ్స్‌ బాగుండడం, ముడి చమురు ధరలు తగ్గుతుండడం, రూపాయి విలువ బలపడుతుండడం, ఎఫ్‌ఐఐల దృక్పథం మారడం వంటి కారణాలతో లాభాల బాటలో పయనిస్తున్నాయి. ప్రధానంగా హెవీ వెయిట్‌ స్టాక్‌లలో కొనుగోళ్లతో సూచీలు పరుగులు తీస్తున్నాయి. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ(Nifty) 52 వారాల గరిష్టానికి చేరుకుని ఆల్‌టైం హై దిశగా సాగుతున్నాయి.

శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ 136 పాయింట్లు, నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. మొదట్లో కొంత ఒత్తిడికి లోనయినా తర్వాత కోలుకుని ముందుకు సాగాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 84 వేల మార్క్‌ను దాటింది. ఇంట్రాడే(Intraday)లో సెన్సెక్స్‌ 83,206 నుంచి 84,162 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,508 నుంచి 25,776 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 603 పాయింట్ల లాభంతో 84,071 వద్ద, నిఫ్టీ 164 పాయింట్ల లాభంతో 25,749 వద్ద ఉన్నాయి.

ఎఫ్‌ఎంసీజీలో దూకుడు.. ఐటీలో సెల్లాఫ్‌..

సూచీలు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో(Auto), బ్యాంకింగ్‌ రంగాల స్టాక్స్‌ రాణిస్తుండగా.. ఐటీలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బీఎస్‌ఈలో కన్జూమర్‌ డ్యూరెబుల్‌ ఇండెక్స్‌ 1.76 శాతం, ఎఫ్‌ఎంసీజీ(FMCG) ఇండెక్స్‌ 1.41 శాతం, టెలికాం 1.32 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 0.72 శాతం, ఆటో 0.70 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.70 శాతం, బ్యాంకెక్స్‌ 0.70 శాతం పెరిగాయి. ఐటీ ఇండెక్స్‌ 1.12 శాతం, కమోడిటీ 0.13 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.12 శాతం, ఇన్‌ఫ్రా 0.10 శాతం, మెటల్‌ 0.09 శాతం నష్టాలతో ఉన్నాయి. లార్జ్‌ క్యాప్‌(Large cap) ఇండెక్స్‌ 0.52 శాతం లాభంతో ఉండగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.13 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.11 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో ఉండగా.. 10 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
ఆసియా పెయింట్‌ 4.58 శాతం, ఎయిర్‌టెల్‌ 3.15 శాతం, ఎంఅండ్‌ఎం 1.86 శాతం, బీఈఎల్‌ 1.74, హెచ్‌యూఎల్‌ 1.67 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎటర్నల్‌ 2.58 శాతం, ఇన్ఫోసిస్‌ 1.88 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.11 శాతం, టెక్‌ మహీంద్రా 0.92 శాతం, టాటాస్టీల్‌ 0.49 శాతం నష్టాలతో ఉన్నాయి.