Homeబిజినెస్​Stock Market | లాభాల బాటలో మార్కెట్లు

Stock Market | లాభాల బాటలో మార్కెట్లు

నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. తొలుత ఒడిదుడుకులకు లోనైనా.. ఆర్‌బీఐ కామెంటరీ తర్వాత కోలుకుని లాభాల బాట పట్టాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic Stock Markets).. తొలుత ఒడిదుడుకులకు లోనైనా.. ఆర్‌బీఐ కామెంటరీ తర్వాత కోలుకుని లాభాల బాట పట్టాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 328 పాయింట్లు, నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.

ఆర్‌బీఐ (RBI) ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం నేపథ్యంలో శుక్రవారం ఉదయం మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ కీలకమైన వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు ఇన్ఫ్లెషన్‌, జీడీపీ విషయంలో పాజిటివ్‌గా చేసిన ప్రకటనతో ప్రధాన సూచీలు పుంజుకున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 140 పాయింట్లు, నిఫ్టీ (Nifty) 34 పాయింట్ల నష్టంతో ప్రారంభమై లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఆర్‌బీఐ రేట్‌ కట్‌ ప్రకటన తర్వాత లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 85,078 నుంచి 85,659 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,985 నుంచి 26,156 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 328 పాయింట్ల లాభంతో 85,594 వద్ద, నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 26,141 వద్ద ఉన్నాయి.

పీఎస్‌యూ బ్యాంక్‌, ఐటీ షేర్లలో జోరు..

బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌లో జోరు కొనసాగుతోంది. పీఎస్‌యూ బ్యాంక్స్‌ రాణిస్తున్నాయి. ఐటీ ఇండెక్స్‌ 1.29 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.08 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 1 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.59 శాతం, మెటల్‌ 0.52 శాతం, ఆటో 0.33 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 0.36 శాతం లాభంతో ఉన్నాయి. సర్వీసెస్‌ ఇండెక్స్‌ 1.19 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.54 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.49 శాతం, ఇన్‌ఫ్రా 0.41 శాతం నష్టాలతో ఉన్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.31 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.01 శాతం లాభాలతో ఉండగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.66 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 19 కంపెనీలు లాభాలతో ఉండగా.. 11 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 2.09 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.92 శాతం, ఇన్ఫోసిస్‌ 1.84 శాతం, టెక్‌ మహీంద్రా 1.82 శాతం, ఎస్‌బీఐ 1.51 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : హెచ్‌యూఎల్‌ 3.58 శాతం, సన్‌ఫార్మా 0.67 శాతం, ట్రెంట్‌ 0.52 శాతం, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ 0.48 శాతం, ఎయిర్‌టెల్‌ 0.46 శాతం నష్టాలతో ఉన్నాయి.

Must Read
Related News