అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | నూతన వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Market) బలహీనంగా ప్రారంభించాయి. మంగళవారం ప్రారంభమయ్యే యూఎస్ ఫెడ్ మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎఫ్‌ఐఐలు నిరంతరాయంగా పెట్టుబడులను ఉపసంహరిస్తుండడం, రూపాయి బలహీనత, రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తుండడంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 88 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. వెంటనే కోలుకుని 98 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 391 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 19 పాయింట్లు పెరిగినా.. అక్కడినుంచి 127 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 313 పాయింట్ల నష్టంతో 85,398 వద్ద, నిఫ్టీ (Nifty) 117 పాయింట్ల నష్టంతో 26,068 వద్ద ఉన్నాయి. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, బీఈఎల్, ఎటర్నల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంది.
ఐటీ సెక్టార్ మినహా..
బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టాలతో సాగుతున్నాయి. ఐటీ ఇండెక్స్ 0.12 శాతం పెరిగింది. సర్వీసెస్ ఇండెక్స్ 2.79 శాతం, రియాలిటీ ఇండెక్స్ 2.67 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.87 శాతం, ఇన్‌ఫ్రా 1.73 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.45 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 1.38 శాతం, యుటిలిటీ 1.36 శాతం, టెలికాం 1.29 శాతం, ఇండస్ట్రియల్ 1.22 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.25 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.94 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.62 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో ఉండగా.. 23 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టెక్ మహీంద్రా 0.77 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.66 శాతం, ఇన్ఫోసిస్ 0.51 శాతం, టీసీఎస్ 0.28 శాతం, రిలయన్స్ 0.19 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : బీఈఎల్ 3.41 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.73 శాతం, ఎటర్నల్ 1.61 శాతం, ట్రెంట్ 1.27 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.11 శాతం నష్టాలతో ఉన్నాయి.