అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | ముడి చమురు ధరలు పెరుగుతుండడం, రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తుండడం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ల (Domestic Stock Markets)పై ఒత్తిడి కనిపిస్తోంది. గత సెషన్‌లో ఆల్‌టైం హైకి చేరిన ప్రధాన సూచీలు.. ఆ తర్వాత దిద్దుబాటుకు గురయ్యాయి.
మంగళవారం సైతం నష్టాల బాటలోనే సాగుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 316 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 85,215 నుంచి 85,553 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ (Nifty) 26,046 నుంచి 26,154 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 294 పాయింట్ల నష్టంతో 85,347 వద్ద, నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 26,090 వద్ద ఉన్నాయి.
మిక్స్‌డ్‌గా సూచీలు..
బీఎస్‌ఈలో సూచీలు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంక్ 1.22 శాతం, టెలికాం 0.73 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.24 శాతం, పీఎస్‌యూ 0.14 శాతం లాభాలతో ఉండగా.. క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ 0.56 శాతం, సర్వీసెస్ 0.52 శాతం, మెటల్ ఇండెక్స్ 0.27 శాతం, కమోడిటీ 0.24 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్ 0.22 శాతం నష్టాలతో ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం లాభాలతో ఉండగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.21 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 10 కంపెనీలు లాభాలతో ఉండగా.. 20 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఆసియా పెయింట్ 1.52 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.22 శాతం, ఎయిర్‌టెల్ 0.94 శాతం, మారుతి 0.42 శాతం, కొటక్ బ్యాంక్ 0.42 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1 శాతం, టాటామోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ 0.88 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.84 శాతం, బీఈఎల్ 0.76 శాతం, హెచ్‌సీఈఎల్ టెక్ 0.71 శాతం నష్టాలతో ఉన్నాయి.
