Homeబిజినెస్​Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. లాభాల్లో ప్రధాన సూచీలు

Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. లాభాల్లో ప్రధాన సూచీలు

Stock Market | ఒడిదుడుకుల మధ్య స్టాక్‌ మార్కెట్లు గురువారం టీసీఎస్‌, టాటా ఎలెక్సీ క్యూ2 ఫలితాలు , ఫలితాలు బాగుండొచ్చన్న అంచనాలతో ఐటీ స్టాక్స్‌ రాణిస్తున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. గురువారం టీసీఎస్‌(TCS), టాటా ఎలెక్సీ క్యూ2 ఫలితాలు రానున్నాయి. ఫలితాలు బాగుండొచ్చన్న అంచనాలతో ఐటీ స్టాక్స్‌ రాణిస్తున్నాయి.

గత సెషన్‌లో నష్టాలతో ముగిసిన ప్రధాన సూచీలు.. గురువారం ఆశావహ దృక్పథంతో ట్రేడిరగ్‌ ప్రారంభించాయి. నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ డే(Expiry day) కావడంతో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్‌ 127 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్ట స్థాయి అయిన 82,009 నుంచి 81,6667 పాయింట్లకు, నిఫ్టీ(Nifty) 25,128 నుంచి 25,024 పాయింట్లకు పడిపోయాయినా తర్వాత పుంజుకున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 265 పాయింట్ల లాభంతో 82,038 వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 25,142 వద్ద ఉన్నాయి.

మెటల్‌, కమోడిటీలో జోష్‌..

స్మాల్‌ క్యాప్‌ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో మెటల్‌ ఇండెక్స్‌ 2.06 శాతం పెరగ్గా.. కమోడిటీ 1.04 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస(Oil and Gas) 0.85 శాతం, ఎనర్జీ 0.79 శాతం, హెల్త్‌కేర్‌ 0.68 శాతం, పీఎస్‌యూ 0.56 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.54 శాతం లాభాలతో ఉన్నాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం ఇండెక్స్‌లు స్వల్ప నష్టాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.10 శాతం నష్టంతో ఉండగా.. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.44 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.41 శాతం లాభంతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో ఉండగా.. 6 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టాటా స్టీల్‌ 3.20 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.85 శాతం, ఎల్‌టీ 1.34 శాతం, ఎటర్నల్‌ 1.10 శాతం, రిలయన్స్‌ 0.76 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టాటామోటార్స్‌ 1.45 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.70 శాతం, టైటాన్‌ 0.70 శాతం, మారుతి 0.38 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.20 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.