అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) నూతన వారాన్ని నష్టాలతో ప్రారంభించింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్ వంటి ఇండెక్స్‌ల హెవీ వెయిట్ స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతూ ప్రధాన సూచీలను వెనక్కి లాగుతున్నాయి.
యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ (Donald Trump).. టారిఫ్‌లను ఆయుధాలుగా వాడుకుంటున్నారు. తన మాట వినని దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్నారు. గ్రీన్ ల్యాండ్ విషయంలో తనకు అడ్డువచ్చే యూరోపియన్ దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలను విధిస్తామన్న ప్రకటనతో గ్లోబల్ మార్కెట్లు (Global Markets) ఒత్తిడికి గురవుతున్నాయి. యూఎస్ టారిఫ్ భయాలకు తోడు ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, విప్రో వంటి కంపెనీల బలహీనమైన క్యూ3 ఫలితాలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇండెక్స్ హెవీ వెయిట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తోంది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 76 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా అక్కడినుంచి 45 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో 641 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ (Nifty) 41 పాయింట్ల నష్టంతో మొదలై అక్కడినుంచి మరో 159 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 515 పాయింట్ల నష్టంతో 83,054 వద్ద, నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 25,535 వద్ద ఉన్నాయి.
ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లలో అమ్మకాలు..
బీఎస్ఈలో రియాలిటీ ఇండెక్స్ 1.88 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 1.69 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.57 శాతం, టెలికాం 1.08 శాతం, యుటిలిటీ 0.72 శాతం, హెల్త్‌కేర్ 0.63 శాతం నష్టాలతో ఉండగా.. సర్వీసెస్ 0.37 శాతం, మెటల్ ఇండెక్స్ 0.10 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.08 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.07 శాతం లాభాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.07 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.62 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.43 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో ఉండగా.. 14 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఇండిగో 3.58 శాతం, టెక్ మహీంద్రా 3.42 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.82 శాతం, కొటక్ బ్యాంక్ 1.57 శాతం, హెచ్‌యూఎల్ 1.43 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : రిలయన్స్ 3.31 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.89 శాతం, ఎటర్నల్ 2.24 శాతం, టీసీఎస్ 1.46 శాతం, అదానిపోర్ట్స్ 1.34 శాతం నష్టాలతో ఉన్నాయి.