అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 101 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.
యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అనుసరిస్తున్న దుందుడుకు చర్యలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎఫ్‌ఐఐల నిరంతర అమ్మకాలు, రూపాయి విలువలో బలహీనత కొనసాగుతుండడం వంటి కారణాలతో మన మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నా సూచీలు నిలదొక్కుకోలేకపోతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 269 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా వెంటనే కోలుకుని 357 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో 427 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 84 పాయింట్ల నష్టంతో మొదలై అక్కడినుంచి 113 పాయింట్లు లాభపడిరది. తిరిగి గరిష్టాలనుంచి 123 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 101 పాయింట్ల లాభంతో 83,728 వద్ద, నిఫ్టీ (Nifty) 42 పాయింట్ల లాభంతో 25,774 వద్ద ఉన్నాయి.
పరుగులు తీస్తున్న మెటల్ షేర్లు..
బీఎస్‌ఈలో మెటల్ ఇండెక్స్ 2.83 శాతం, కమోడిటీ 1.62 శాతం, ఎనర్జీ 0.98 శాతం, పవర్ 0.88 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.88 శాతం, పీఎస్‌యూ 0.83 శాతం, టెలికాం 0.82 శాతం లాభాలతో ఉన్నాయి. రియాలిటీ ఇండెక్స్ 1.12 శాతం, ఐటీ 0.92 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.37 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.34 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.08 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 15 కంపెనీలు లాభాలతో ఉండగా.. 15 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టాటా స్టీల్ 4.16 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.27 శాతం, ఎన్టీపీసీ 2.47 శాతం, బీఈఎల్ 1.62 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.09 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టీసీఎస్ 1.67 శాతం, హెచ్‌యూఎల్ 1.62 శాతం, ఆసియన్ పెయింట్ 1.45 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.14 శాతం, సన్‌ఫర్మా 1.13 శాతం నష్టాలతో ఉన్నాయి.