అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ కనిష్టాల వద్ద కొనుగోళ్లకు పాల్పడుతుండడంతో మార్కెట్ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగుతోంది. ప్రిఫరెన్షియల్ పథకం కింద భారత్, ఇండోనేషియా, కెన్యా దేశాల్లోని కొన్ని రంగాల ఉత్పత్తులకు కల్పించిన ఎగుమతి ప్రయోజనాలను యూరోపియన్ యూనియన్ రద్దు చేసింది.
ఈ నిర్ణయం నెల 1 నుంచే అమల్లోకి వచ్చింది. దీని వల్ల మన దేశంనుంచి ఈయూకు ఎగుమతి చేసే పలు ఉత్పత్తులపై టారిఫ్‌లు 9.6 శాతంనుంచి 12 శాతానికి పెరగనున్నాయి. దీని ప్రభావం మార్కెట్‌పై కనిపిస్తోంది.శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 28 పాయింట్లు, నిఫ్టీ (Nifty) 55 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. అయితే మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 82,131 నుంచి 82,516 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,2449 నుంచి 25,347 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 133 పాయింట్ల నష్టంతో 82,173 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 25,257 వద్ద ఉన్నాయి.
పీఎస్‌యూలో ర్యాలీ..
బీఎస్ఈలో కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 1.19 శాతం, మెటల్ 1.04 శాతం, కమోడిటీ 0.43 శాతం శాతం లాభాలతో ఉన్నాయి. సర్వీసెస్ 1.17 శాతం, రియాలిటీ ఇండెక్స్ 1.02 శాతం, పవర్, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌లు 0.69 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.66 శాతం, ఇండస్ట్రియల్ 0.42 శాతం, టెలికాం 0.38 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.69 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.09 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.04 శాతం నష్టాలతో సాగుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 14 కంపెనీలు లాభాలతో ఉండగా.. 16 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఆసియన్ పెయింట్ 2.73 శాతం, హెచ్‌యూఎల్ 1.46 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.18 శాతం, టీసీఎస్ 1..17 శాతం, టైటాన్ 0.78 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇండిగో 2.99 శాతం, ఎటర్నల్ 2.79 శాతం, పవర్‌గ్రిడ్ 1.75 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.99 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.98 శాతం నష్టాలతో ఉన్నాయి.