అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Markets | ఎఫఐఐల నిరంతర అమ్మకాలు, రూపాయి విలువలో బలహీనత, కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మన మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ (Sensex) 76 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా వెంటనే 45 పాయింట్లు పెరిగింది.
అక్కడినుంచి 641 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో మొదలై మరో 159 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్ కోలుకుంటున్నట్లే కనిపించినా.. చివరలో మళ్లీ ప్రాఫిట్ బుకింగ్‌తో సూచీలు దిగజారాయి. చివరికి సెన్సెక్స్ 324 పాయింట్ల నష్టంతో 83,246 వద్ద, నిఫ్టీ 109 పాయింట్ల నష్టంతో 25,585 వద్ద స్థిరపడ్డాయి. మూడో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో విప్రో 8 శాతం నష్టపోగా రిలయన్స్ మూడు శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.35 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.55 శాతం నష్టాలను చవిచూశాయి.
Stock Markets | రియాలిటీ, ఎనర్జీ స్టాక్స్‌లో అమ్మకాలు..
బీఎసఈలో (BSE) రియాలిటీ ఇండెక్స్ 1.94 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 1.50 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.32 శాతం, టెలికాం 1.08 శాతం, యుటిలిటీ 0.97 శాతం, హెల్త్‌కేర్ 0.81 శాతం, క్యాపిటల్ మార్కెట్, కమోడిటీ ఇండెక్స్‌లు 0.62 శాతం నష్టపోగా.. సర్వీసెస్ ఇండెక్స్ 0.39 శాతం, ఎఫఎంసీజీ 0.39 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.37 శాతం, ఆటో ఇండెక్స్ 0.11 శాతం లాభపడ్డాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.28 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ (Mid Cap index) 0.43 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.42 శాతం నష్టపోయాయి.
Stock Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎసఈలో నమోదైన కంపెనీలలో 1,226 కంపెనీలు లాభపడగా 3,075 స్టాక్స్ నష్టపోయాయి. 182 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 97 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 438 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Markets | Top gainers..
బీఎసఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభపడగా.. 14 కంపెనీలు నష్టపోయాయి. ఇండిగో 3.97 శాతం, టెక్ మహీంద్రా 2.36 శాతం, హెచ్‌యూఎల్ 2.10 శాతం, కొటక్ బ్యాంక్ 2.02 శాతం, మారుతి 1.96 శాతం లాభపడ్డాయి.
Stock Markets | Top losers..
రిలయన్స్ 3.04 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.26 శాతం, ఎటర్నల్ 2.19 శాతం, టైటాన్ 1.40 శాతం, అదానిపోర్ట్స్ 1.39 శాతం నష్టపోయాయి.