అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | పట్టణంలోని మార్కండేయ ఆలయంలో (Markandeya Temple) బుధవారం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతిని (Markandeya Jayanti) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఆలయం వద్ద గణపతి పూజ, మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు, హోమం, పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. అనంతరం పద్మశాలి భవనం (Padmashali Bhavan) నుంచి మార్కండేయ స్వామి చిత్రపటంతో పట్టణ కేంద్రంలోని డైలీ మార్కెట్, గాంధీచౌక్, శివాలయం మీదుగా భారీ శోభాయాత్ర నిర్వహించారు.
Yellareddy | మహిళల కోలాటం
శోభాయాత్రలో మహిళలు కోలాటం ఆడుతూ భక్తి భజనలు చేశారు. మహిళలు ఏకరూప దుస్తులతో భక్తి పాటలతో కోలాటాలు ఆడడం ఆకట్టుకుంది. అనంతరం ఆలయం వద్ద అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు విద్య రవి, ప్రతినిధులు సోమయ్య, శ్యాంసుందర్, ఆంజనేయులు, శేఖర్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.