Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | నగరంలో గంజాయి పట్టివేత

Nizamabad City | నగరంలో గంజాయి పట్టివేత

నిజామాబాద్​ నగరంలో గుట్టుగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడవ టౌన్​ ఎస్సై హరిబాబు వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad City | నగరంలో గుట్టుగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడవ టౌన్​ ఎస్సై హరిబాబు (SI Haribabu) తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్​ చౌరస్తా వద్ద బీహార్​కు (Bihar) చెందిన రాంనాథ్​ మెహతా అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు.

ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా.. 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయి కొనేందుకు అక్కడికి వచ్చిన ఏడుగురిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వారికి టెస్ట్​ చేయగా పాజిటివ్​గా వచ్చింది. దీంతో వారిందరిపై కేసు నమోదు చేసి రిమాండ్​ కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Must Read
Related News