అక్షరటుడే, వెబ్‌డెస్క్: ceasefire : కేంద్ర ప్రభుత్వం శాంతిచర్చలు జరపాలని కోరుతూ మావోయిస్టులు లేఖ విడుదల చేసినట్లు సమాచారం. కాల్పుల విరమణ ప్రకటించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖలో కోరింది. షరతులు లేకుండా చర్చలు జరపాలంటూ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ బయటకి వచ్చింది.
కాగా.. కర్రెగుట్ట karregutta search operation ప్రాంతంలో ఆపరేషన్ కగార్ operation kagar పేరుతో కేంద్రం మావోలను ఏరివేతకు శ్రీకారం చుట్టింది. గత కొద్ది రోజులుగా కర్రెగుట్ట ప్రాంతంలో ప్రత్యేక బృందాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే మావోల రహస్య స్థావరాలను భద్రతా బలగాలు గుర్తించాయి. అలాగే పలువురు మావోయిస్టులను మట్టుబెట్టాయి. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సహా మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. అలాగే మావోయిస్టు నేతలు సైతం కాల్పులను విరమించుకోవాలని కోరారు. కానీ, కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.