HomeజాతీయంMaoist Mallojula | కాలానికి అనుగుణంగా మారాల్సిందే.. సాయుధ పోరాటం వీడాల్సిందే : మల్లోజుల

Maoist Mallojula | కాలానికి అనుగుణంగా మారాల్సిందే.. సాయుధ పోరాటం వీడాల్సిందే : మల్లోజుల

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maoist Mallojula | మావోయిస్టులు బలహీనపడుతున్న తరుణంలో విప్లవ పోరాటం విరమించడమే మంచిదని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) Communist Party of India (Maoist) ముఖ్య ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను స్పష్టం చేశారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారుదామని, ప్రజల్లోకి వెళ్లి ప్రజా స్థావరాన్ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు Mallojula Venugopal Rao తాజాగా మరో లేఖ విడుదల చేశారు.

పార్టీని కాపాడటానికి సాయుధ పోరాటాన్ని నిలిపివేయాలని మరోసారి పునరుద్ఘాటించారు. పార్టీ బలహీన పడిన తరుణంలో వెనక్కు తగ్గడం శ్రేయస్కరమని Sonu అభిప్రాయపడ్డారు.

Maoist Mallojula | రెండో లేఖ..

మల్లోజుల వేణుగోపాలరావు (70) తన ఫొటోతో గత నెలలో తొలి లేఖ విడుదల చేశారు. ఆగస్టు 15వ తేదీన రాసిన ఆ లేఖ సెప్టెంబరు 12న బయటకు వచ్చింది.

సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడానికి, ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మావోలు సిద్ధంగా ఉన్నారని మల్లోజుల పేర్కొన్నారు. అయితే, ఆ లేఖను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ లేఖతో పార్టీకి సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ తెలిపారు.

ఈ నేపథ్యంలో మల్లోజుల పేరిట మరో లేఖ తాజాగా విడుదలైంది. 2024 ఆగస్టులో పొలిట్ బ్యూరో Polit Bureau జారీ చేసిన సర్క్యులర్​కు కొనసాగింపుగా తన లేఖ ఉందని మల్లోజుల స్పష్టం చేశారు.

అది పార్టీ బలహీనంగా ఉన్నందున వెనుకకు తగ్గడమే మంచిదనే భావనను పొలిట్ బ్యూరో అభిప్రాయపడిందన్నారు.

తాత్కాలిక కాల్పుల విరమణ, ఆయుధాలను నిలిపివేయడం ద్వారా మాత్రమే పార్టీ తనను తాను రక్షించుకోవడానికి ఉన్న ఏకైక ఎంపిక అని మల్లోజుల తేల్చి చెప్పారు. ఎందుకంటే శాంతి చర్చలు ఒక ఎంపిక కాదు, రెండూ లొంగిపోవడం కాదని పేర్కొన్నారు.

Maoist Mallojula | కాలానికి తగ్గట్లు మారుదాం..

దివంగత పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ రావు అలియాస్ బసవరాజు సాయుధ పోరాటాన్ని నిలిపివేయడానికి అనుకూలంగా ఉండే వారని మల్లోజుల తన లేఖలో పేర్కొన్నారు.

“సాయుధ పోరాట విరమణ ప్రకటన జారీ చేస్తున్నప్పుడు, (మావోయిస్ట్ పార్టీకి) చాలా కాలంగా సేవ చేస్తున్న ప్రజలకు నేను క్షమాపణలు కోరుతున్నాను” అని లేఖలో పేర్కొన్నారు.

పార్టీ శ్రేణులలో దశల వారీగా చర్చించాకే విప్లవ పోరాట విరమణ ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. “మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారదాం. ప్రజల మధ్యకు వెళ్లి ప్రజా స్థావరాన్ని బలోపేతం చేద్దాం” అని మల్లోజుల తన లేఖలో స్పష్టంగా తెలిపారు.