అక్షరటుడే, బాన్సువాడ : Banswada | బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామానికి (Tadkol Village) చెందిన సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. బాన్సువాడ నియోజకవర్గ సీనియర్ నాయకుడు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ (Former Vice Chairman Sheikh Zubair) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ.. తాడ్కోల్ గ్రామ ప్రజలు అభివృద్ధి, శాంతి కోసం బీఆర్‌ఎస్ పార్టీపై నమ్మకం ఉంచి ఆ పార్టీలో చేరడం జరిగిందన్నారు. గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలకు తాము నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party)లోకి చేరిన వారిలో నూర్ మియా, అంజయ్య, సిద్దప్ప, షకీల్ సదర్, వాహిద్ భాయ్, గౌస్ టైలర్, బషీర్ ఖాన్, షేక్ ఖమర్, షేక్ జుబేర్ దుబ్బా, షేక్ సుమర్, ఆవేజ్, అమీర్, ఆసిఫ్, ఫైసల్, కలీం, షోయబ్ తదితరులు ఉన్నారు.
