Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | షబ్బీర్​అలీ సమక్షంలో కాంగ్రెస్​లో పలువురి చేరిక

Kamareddy | షబ్బీర్​అలీ సమక్షంలో కాంగ్రెస్​లో పలువురి చేరిక

గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో పార్టీలో చేరడానికి కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) వేళ కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో పార్టీలో చేరడానికి కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు.

భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్, భిక్కనూరు గ్రామాల నుంచి పలువురు కార్యకర్తలు శుక్రవారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (government advisor Shabbir Ali) సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. వారికి షబ్బీర్​అలీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు (welfare schemes), సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్థానిక అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల వంటి సంక్షేమ పథకాలు ప్రజల మద్దతును కూడగట్టడంతో పాటు, ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు.

Must Read
Related News