అక్షరటుడే, వెబ్‌డెస్క్: Smrithi Mandhana | టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, బాలీవుడ్ గాయకుడు పలాశ్ ముచ్చల్ వివాహంపై అనిశ్చితి కొనసాగుతోంది. నవంబర్ 23న జరగాల్సిన ఈ పెళ్లి, మంధాన తండ్రి శ్రీనివాస్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురవడంతో వాయిదా పడింది.
హల్దీ, మెహందీ, సంగీత్ వరకు సందడిగా వేడుకలు సాగగా, పెళ్లి చివరి క్షణంలోనే ఆగిపోవడం అభిమానులను నిరుత్సాహానికి గురిచేసింది. ఇక కొత్త తేదీ ఎప్పుడు? అన్నదే అందరి మనసులో ప్రశ్నగా మారింది. సోషల్ మీడియాలో (Social Media) “డిసెంబర్ 7నే మంధాన–పలాశ్ పెళ్లి” అంటూ కథనాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాల నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు మంధాన సోదరుడు శ్రవణ్‌ను సంప్రదించగా, అతడు షాకింగ్ సమాధానం ఇచ్చాడు.
Smrithi Mandhana | సోదరుడు క్లారిటీ..
‘‘సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల గురించి నాకు తెలియదు. మంధాన – పలాశ్ (Palash Muchhal) వివాహం వాయిదా పడింది. అంతే.. కొత్త తేదీని ఇంకా నిర్ణయించలేదు.” అని శ్రవణ్ స్పష్టంగా తెలిపాడు. దీంతో డిసెంబర్ 7 ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టయ్యింది. పలాశ్ తల్లి అమిత అయితే ఆశాభావంతో ఉన్నారు. ఆమె మాట్లాడుతూ.. “ప్రస్తుతం వారిద్దరూ మానసికంగా కృంగిపోయారు. నా కుమారుడు మంధానను నవవధువుగా ఇంటికి తీసుకురావడం కోసం ఎంతో ఎదురుచూశాడు. నేను కూడా ప్రత్యేక స్వాగతానికి ఏర్పాట్లు చేసుకున్నాను. అనుకోని పరిస్థితుల వల్ల పెళ్లి వాయిదా పడింది. అయినా మా కుటుంబాల్లో ఎలాంటి సమస్య లేదు. త్వరలోనే మంధాన–పలాశ్‌ల పెళ్లి జరుగుతుందని నమ్ముతున్నాను.” అని చెప్పారు.
నవంబర్ 23న జరగాల్సిన పెళ్లికి ముందు మంధాన తండ్రి గుండెపోటుకు (Heart Attack) గురవడంతో పెళ్లిని వాయిదా వేశారు. ఆ తర్వాత పలాశ్ కూడా ఆరోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరడం మరింత చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో పలాశ్ ఒక కొరియోగ్రాఫర్‌తో అఫైర్ పెట్టుకున్నాడనే రూమర్లు కూడా వైరల్ అయ్యాయి. దీనిపై ఈ జంట మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వకుండా ఇన్‌స్టాలో ‘దిష్టిబొమ్మ’ పోస్ట్ చేయడం ద్వారా వదంతులను కొట్టిపారేశారు. అయితే మంధాన తండ్రి శ్రీనివాస్, పలాశ్ ఇద్దరూ ఇప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయినా ఇరుకుటుంబాలు ఇప్పటివరకు కొత్త పెళ్లి తేదీని ప్రకటించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
