అక్షర టుడే, ఇందూరు: Navaratri | అటు బతుకమ్మ సంబరాలు(Bathukamma celebrations).. ఇటు దేవీ నవరాత్రులకు నగరం ముస్తాబైంది. వాడవాడలా దేవీ నవరాత్రులు (Devi Navaratri) అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అమ్మవారి ఆగమన కార్యక్రమాలతో అలరించారు.
గణపతి ఉత్సవాలకు (Ganapati festival) ధీటుగా దేవీ నవరాత్రులు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వినాయక నగర్ లోని శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైటింగ్ ఆకట్టుకుంటోంది. అలాగే కోట గల్లి, శివాజీ నగర్, పద్మ నగర్, గాయత్రి నగర్, చంద్రశేఖర కాలనీ, సుభాష్ నగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మండపాలను సిద్ధం చేశారు. సోమవారం నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అలాగే దేవి మాత ఆలయం, పెద్దమ్మ తల్లి ఆలయం, గాయత్రీ దేవి ఆలయం, లలితా దేవి ఆశ్రమం, తదితర అమ్మవారి ఆలయాలను విద్యుద్దీప అలంకరణతో ముస్తాబు చేశారు.
* జిల్లాలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. మహిళలు ఆదివారం ఉత్సాహంగా ఆటపాటలతో ఎంగిలి బతుకమ్మను పేర్చారు. నగరంలోని జెండా గుడి, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, నగరేశ్వర ఆలయంతో పాటు పలు కాలనీలో బతుకమ్మతో మహిళలు ఆకట్టుకున్నారు.