అక్షరటుడే, ఆర్మూర్: Manda Krishna Madiga | ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్స్‌లో (MR Gardens) వికలాంగుల, చేయూత పెన్షన్‌దారుల సన్నాహక గర్జన సదస్సును మంగళవారం నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) హాజరు కానున్నారు.
Manda Krishna Madiga | సభను విజయవంతం చేయాలి..
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్(Kanaka Pramod) ఆధ్వర్యంలో సోమవారం జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌లో పర్యటించారు. బీడీ కార్మికులకు, వృద్ధులను కలిసి గర్జన సదస్సు (Garjana Summit)కు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వేల్పుల వరుణ్, అనిల్ పాల్గొన్నారు.