అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mana Shankara Varaprasad Garu | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీసు దగ్గర దూసుకు పోతుంది. తొలిరోజు భారీ కలెక్షన్లు సాధించింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పండుగ సందర్భంగా రిలీజైన సినిమాల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దర్శకుడు (Director Anil Ravipudi) పెద్దగా శ్రమించుకుండా.. తనకు అలవాటు ఉన్న కామెడీ జానర్‌ను నమ్ముకున్నాడు. దీంతో పండుగ పూట కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడొచ్చని ప్రేక్షకులు అంటున్నారు.
Mana Shankara Varaprasad Garu | రూ.84 కోట్ల కలెక్షన్లు
మన శంకర వర ప్రసాద్ గారు సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకు పోతుంది. శనివారం సాయంత్రం ఈ మూవీ ప్రీమియర్ షో విడుదలైంది. ప్రీమియర్స్, తొలి రోజు కలెక్షన్లు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్గా ఈ మూవీ రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు మంగళవారం చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది. మెగాస్టార్ వింటేజ్ లుక్‌లో అదరగొట్టడంతో చిరు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రం ఇండియాలో రూ.38 కోట్లకి పైగా నెట్ కలెక్షన్లు సంపాదించినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.