అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. తమ అధికారుల ఫోన్లు, కీలక డాక్యుమెంట్లను లాక్కున్నట్లు పేర్కొంది.
కోల్‌కతా (Kolkata)లోని ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయం, దాని డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంపై ఈ నెల 8న ఈడీ దాడులు (ED Raids) చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సీఎం మమత (CM Mamatha) హంగామా చేశారు. ఐ ప్యాక్ కార్యాలయానికి చేరుకొని పలు డాక్యుమెంట్లు తీసుకొని వెళ్లారు. ఈ వ్యవహారంపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్‌ను గురువారం న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. అధికారుల ఫోన్లు, కీలక డాక్యుమెంట్లను మమతా బెనర్జీతో పాటు పోలీసులు లాక్కున్నారని పేర్కొన్నారు.
Supreme Court | ఎందుకు వచ్చారు
మమతా బెనర్జీ ఐ-ప్యాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేశారని తెలిపారు. కోల్‌కతా హైకోర్టు (Kolkata High Court)లో వాదించకుండా తమ లాయర్‌ను అడ్డుకున్నారని చెప్పారు. హైకోర్టులో తమ లాయర్ మైక్ కట్ చేశారన్నారు. మమతా బెనర్జీ ఒక ప్రణాళిక ప్రకారం కథను నడిపిస్తున్నారని ఆయన వాదించారు. కోల్‌కతా హైకోర్టుకు బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాలను తరలించారని ఆరోపించారు. హైకోర్టును జంతర్‌మంతర్‌గా మార్చారా అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్ మ్యాటరని, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కేసు మొత్తాన్ని పూర్తిగా పరిశీలించాలని స్పష్టం చేసింది.
Supreme Court | వారిని సస్పెండ్ చేయాలి
ఈడీ సోదాల సమయంలో సీఎం మమతా బెనర్జీతో పాటు డీజీపీ పోలీస్ కమిషనర్, ఏరియా DCP మరియు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి వచ్చారని సొలిసిటర్ జనరల్ తెలిపారు. సరైన అధికారం లేకుండా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని చెపారు. దీనిని దొంగతనం నేరంగా ఆయన అభివర్ణించారు. దాడి సమయంలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలని, వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును అభ్యర్థించారు.