HomeజాతీయంMallojula Venugopal | లొంగిపోయిన మల్లోజుల.. మహారాష్ట్ర సీఎంకు ఆయుధాలు అప్పగింత

Mallojula Venugopal | లొంగిపోయిన మల్లోజుల.. మహారాష్ట్ర సీఎంకు ఆయుధాలు అప్పగింత

Mallojula Venugopal | మావోయిస్ట్​ పార్టీ పోలిట్​ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్​రావు బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ ఎదుట లొంగిపోయారు. ఆయనతో మరో 61 మంది తమ ఆయుధాలను సీఎంకు అప్పగించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallojula Venugopal | మావోయిస్ట్​ అగ్రనేత, పోలిట్​ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్​రావు మంగళవారం లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ (Maharashtra CM Devendra Fadnavis)బుధవారం అధికారికంగా ప్రకటించారు.

గడ్చిరోలి ఎస్పీ ఆఫీసు (Gadchiroli SP Office)లో సీఎం ఫడ్నవీస్​ ప్రెస్​మీట్​ పెట్టారు. నిషేధిత CPI (మావోయిస్ట్) సీనియర్ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్​ సోనూ, అలియాస్​ భూపతి 61 మంది మావోయిస్టులతో కలిసి అక్టోబర్ 13–14 రాత్రి భమ్రాగఢ్‌లోని ఫోడేవాడ గ్రామంలో పోలీసులకు లొంగిపోయారు. ఈ క్రమంలో ఆయనతో పాటు మిగతా మావోలు సీఎంకు బుధవారం ఆయుధాలను అప్పగించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్​ మాట్లాడుతూ.. మావోయిస్టులు (Maoists) లొంగిపోవాలని సూచించారు. గత నాలుగు సంవత్సరాలలో ఈ ప్రాంతం ఒక్కరు కూడా ఉద్యమంలో చేరలేదని చెప్పారు. ఈ పురోగతికి C-60 కమాండోల కృషి, రాజ్యాంగ పాలనపై పెరుగుతున్న నమ్మకమే కారణమని ఆయన అన్నారు. అభివృద్ధి, శాంతి పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఆయన నొక్కిచెప్పారు.

Mallojula Venugopal | పెద్దపల్లి నుంచి..

మల్లోజుల వేణుగోపాల్​ పెద్దపల్లి జిల్లా (Peddapalli District)కు చెందిన వారు. 2011లో ఎన్​కౌంటర్​లో చనిపోయిన కిషన్​జీ అలియాస్​ మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు. ఆయన భార్య తారక్క 2018 ఎన్​కౌంటర్​ మరణించారు. 1970లో ఉద్యమ బాట పట్టిన ఆయన అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించారు. వెస్ట్​ బెంగాల్​ లాల్​గడ్​ ఉద్యమానికి వేణుగోపాల్ నాయకత్వం వహించారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్​ పొలిట్ బ్యూరో సభ్యురాలు పోతుల సుజాత వేణుగోపాల్ అన్న భార్య కావడం గమనార్హం.

Mallojula Venugopal | అనేక కేసులు

మల్లోజుల వేణుగోపాలరావు (Mallojula Venugopal Rao)పై వందకు పైగా కేసులు ఉన్నాయి. సోను, సోను దాదా, అభయ్, మాస్టర్, వివేక్, వేణు వంటి మారుపేర్లతో కూడా మల్లోజులను పిలుస్తారు. ఆయన మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లలో పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నాడు. 76 మంది CRPF సిబ్బందిని బలిగొన్న 2010 దంతెవాడ ఆకస్మిక దాడిలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు భావిస్తున్నారు. ఆయన లొంగిపోవడం గడ్చిరోలిలో మావోలకు పెద్ద ఎదురు దెబ్బ అని పోలీసులు పేర్కొంటున్నారు.