అక్షరటుడే, వెబ్డెస్క్ : Kharge | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (83) అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి ఆస్పత్రికి తరలించారు.
ఖర్గే ప్రస్తుతం బెంగళూరు (Bangalore)లోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆయన చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి ఆస్పత్రికి వచ్చిన వెంటనే వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. కాగా ఖర్గే అస్వస్థత వార్తతో కాంగ్రెస్ (Congress) శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ నేతలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఖర్గే పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతారని కుటుంబ సభ్యులు తెలిపారు.