అక్షరటుడే, కోటగిరి : MLA Pocharam | గ్రామాల్లో మరింత అభివృద్ధి కోసం కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పోతంగల్ (Pothangal) సర్పంచ్ అభ్యర్థి గంధపు చైతన్య పవన్ కుమార్కు మద్దతుగా సోమవారం ఆయన గ్రామంలో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలను సర్వే చేయించి ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మాణాలు చేయించి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి జరగాలంటే ఓ మంచి నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Kasula Balaraj) మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గంధపు చైతన్య పవన్ కుమార్(Chaitanya Pawan Kumar)ను అత్యధిక మెజారిటీతో గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు శంకర్ పటేల్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పల శంకర్, కేశ వీరేశం, వర్ని శంకర్, గంట్ల విఠల్, నబీ, మాణిక్ అప్పా, జుమ్మా ఖన్, రాజు,దత్తు, గంగులు, గంగాధర్ కిరాణం తదితరులు పాల్గొన్నారు.