HomeతెలంగాణYadadri Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Yadadri Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Yadadri Power Plant : నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో (Yadadri Power Plant) భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పవర్‌ ప్లాంట్‌ మొదటి యూనిట్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో బాయిలర్‌ నుంచి ఆయిల్‌ లీక్‌ అయింది. అదే సమయంలో కింద వెల్డింగ్‌ చేస్తుండగా మంటలు అంటుకుని, యూనిట్‌ మొత్తానికి వ్యాపించి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతుండగా ప్రమాదం సంభవించడం గమనార్హం.