HomeజాతీయంChhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​.. 12 మంది మావోలు, ముగ్గురు జవాన్లు మృతి

Chhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​.. 12 మంది మావోలు, ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. బీజాపూర్​, దంతెవాడ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటుచేసుకోగా.. 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. బీజాపూర్​, దంతెవాడ (Bijapur and Dantewada) సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటుచేసుకోగా.. 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

దంతెవాడ అటవీ ప్రాంతంలో (Dantewada forest area) మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రాకు చెందిన సిబ్బంది బుధవారం కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది నక్సల్స్​ చనిపోయారు. ముగ్గురు డీఆర్​జీ సిబ్బంది సైతం మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. భద్రతదళాలు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

Chhattisgarh Encounter | భారీగా ఆయుధాలు స్వాధీనం

భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌కు (anti-Naxal operation) బయలుదేరినప్పుడు బీజాపూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దులోని అడవిలో కాల్పులు జరిగాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ పట్టిలింగం తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి 12 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారి వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. సింగిల్ లోడింగ్ రైఫిల్స్ (SLRలు), ఇన్సాస్ రైఫిల్స్, 303 రైఫిల్స్, ఇతర ఆయుధాలు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

బీజాపూర్ DRGకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మోను వడాడి, కానిస్టేబుల్ దుకారు గొండే, జవాన్ రమేష్ సోధి ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. పశ్చిమ బస్తర్ డివిజన్‌లోని ఎన్‌కౌంటర్ ప్రదేశానికి బలగాలను పంపామని, ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.

Must Read
Related News