అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mahesh Babu | ఈడీ నోటీసులు ed notices అందుకున్న సూపర్‌స్టార్ super star మహేశ్‌బాబు mahesh babu విచారణకు హాజరు కాలేదు. సాయి సూర్య డెవలపర్స్ sai surya developers అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మహేశ్‌బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అయితే ఆయన ఇప్పటి వరకు ఈడీ కార్యాలయానికి వెళ్లలేదు.
సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ కంపెనీలకు ప్రమోషన్స్ promotions చేసేందుకు మహేశ్ బాబు రూ.5.90 కోట్లు తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే మనీ లాండరింగ్(Money laundering )కు పాల్పడిన ఆ కంపెనీలకు ప్రమోషన్ చేసి ప్రజలు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే షూటింగ్లో బిజీగా ఉండడంతోనే మహేశ్‌బాబు విచారణకు రాలేదని సమాచారం. దీనిపై సాయంత్రంలోగా ఆయన లాయర్లు ఈడీ అధికారులను కలిసి వివరణ ఇవ్వనున్నట్లు తెలిసింది.