అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Samantha | టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా గుర్తింపు సంపాదించిన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్‌లు, పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి వెబ్ సిరీస్‌లతో బాలీవుడ్, ఓటీటీ మార్కెట్‌లో తన స్థాయిని చాటిన సమంత, ప్రస్తుతం ఫుల్‌ఫ్లెడ్ థియేట్రికల్ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సమంత నటిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ చేస్తూ నేడు టీజర్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కొద్ది సేపటి క్రితం టీజర్ ట్రైలర్ విడుదలైంది.
Samantha | టీజర్‌తో చంపేసింది..
ఇందులో సమంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించడం, బస్సులో చీర కట్టుతో కాంప్లికేటెడ్ యాక్షన్ స్టయిల్ ప్రదర్శించడం విశేషం. సమంత ఇప్పటి వరకు చేసిన భిన్న పాత్రలకు విరుద్ధంగా, ఈ సినిమాలో క్రైమ్ యాక్షన్ (Crime Action) నేపథ్యంలోని పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఒకవైపు చాలా ఇన్నోసెంట్‌గా కనిపిస్తూ మరోవైపు ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించి అలరించనుందని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా టీజర్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సినిమా నందినీ రెడ్డి దర్శకత్వం (Director Nandini Reddy)లో తెరకెక్కుతుంది. సమంత–నందినీ రెడ్డి కాంబినేషన్‌లో ‘ఓ బేబీ’ తర్వాత మూడో చిత్రం కావడం, అభిమానుల అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా నిర్మిస్తున్న రెండో చిత్రం కావడం మరింత ప్రత్యేకతను ఇస్తోంది.
టీజర్‌పై అభిమానులు “క్వీన్ ఈజ్ బ్యాక్” అంటూ ఉత్సాహంగా స్పందిస్తున్నారు. గత కొన్ని నెలలుగా సినిమా విషయంపై ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో మూవీ ఆగిపోయిందేమోనని భావించిన అభిమానులకు టీజర్ సాలిడ్ రిలీఫ్‌గా నిలిచింది. సినిమాకు కథను ప్రఖ్యాత దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) అందించగా, సమంతతో పాటు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించడంతో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1980ల నేపథ్యంతో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కంటెంట్ పరంగా కూడా బలమైన సన్నివేశాలు ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
