అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad CP | బ్రెయిలీ లిపి కాదని.. అంధుల ఆశాజ్యోతి అని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ (Sneha Society) ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధుల వనరుల కేంద్రంలో బ్రెయిలీ జయంతిని ఘనంగా నిర్వహించారు.
Nizamabad CP | అంధత్వం అడ్డుకాదు
సీపీ మాట్లాడుతూ అంధుల అభ్యున్నతికి అంధత్వమనేది అడ్డు కాదని అన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు చెప్పారన్నారు. కళ్లు లేకున్నప్పటికీ ప్రపంచాన్ని చూసేందుకు లూయిస్ బ్రెయిలీ లిపిని కనిపెట్టారని సీపీ చెప్పారు. అంధులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు.
దివ్యాంగ ఉద్యోగులు, విద్యార్థులకు ఏమైనా సమస్యలు వస్తే పోలీస్‌శాఖ (police department) ఎప్పుడూ అండగా ఉంటుందని సీపీ హామీ ఇచ్చారు. అనంతరం సీపీ అంధ విద్యార్థులకు కేక్ తినిపించారు. అనంతరం నోట్‌పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అంధ విద్యార్థిని రజిని స్నేహ సొసైటీ పాఠశాలకు రూ.50వేల విలువైన బెంచీలను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ, స్నేహ సొసైటీ అంధుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, పాఠశాల డైరెక్టర్ సిద్ధయ్య, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, అర్బన్ సీడీపీవో సౌందర్య, అంధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాయన్న, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఆరోగ్య రాజు, 100 నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇలియాజుద్దీన్ పాల్గొన్నారు.