అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో పతనం కొనసాగుతోంది. లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి ఉంది. దీంతో ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 448 పాయింట్లు, నిఫ్టీ 136 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.
భారత్, యూఎస్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడం, రైస్ దిగుమతులపై యూఎస్ అదనపు సుంకాలు విధించే అవకాశాలు ఉండడం, గ్లోబల్ మార్కెట్లు (Global Markets) బలహీనంగా ట్రేడ్ అవుతుండడం వంటి కారణాలతో మన స్టాక్ మార్కెట్‌లో పతనం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 360 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అక్కడినుంచి మరో 360 పాయింట్లు నష్టపోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 537 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ (Nifty) 93 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 139 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి 162 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 448 పాయింట్ల నష్టంతో 84,654 వద్ద, నిఫ్టీ 136 పాయింట్ల నష్టంతో 25,823 వద్ద ఉన్నాయి.
యూఎస్, భారత్‌ల మధ్య ఈవారంలో వాణిజ్య చర్చలు జరగనున్నాయి. అయితే యూఎస్‌లో సెలవులతోపాటు భారత్‌నుంచి దిగుమతయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్) బెదిరింపులకు దిగుతుండడంతో వాణిజ్య చర్చల తుది ఫలితం ఈ నెలలో వెలువడే అవకాశాలు లేవని మార్కెట్ భావిస్తోంది. దీంతో మన మార్కెట్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతున్నారు.
ఐటీలో సెల్లాఫ్..
బీఎస్‌ఈ(BSE)లో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.86 శాతం, టెలికాం 0.67 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.51 శాతం, ఇండస్ట్రియల్ 0.46 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.47 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 0.46 శాతం లాభంతో ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ 1.15 శాతం, ఆటో 0.62 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.46 శాతం మెటల్ 0.33 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం లాభంతో ఉండగా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం నష్టంతో ఉంది.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 11 కంపెనీలు లాభాలతో ఉండగా.. 19 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టైటాన్ 1.32 శాతం, ఎటర్నల్ 0.95 శాతం, బీఈఎల్ 0.91 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.58 శాతం, అదాని పోర్ట్స్ 0.47 శాతంలాభాలతో ఉన్నాయి.
Top Losers : ఆసియా పెయింట్ 3.74 శాతం, టీసీఎస్ 1.49 శాతం, ఎంఅండ్‌ఎం 1.23 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.18 శాతం, టాటా స్టీల్ 1.04 శాతం నష్టాలతో ఉన్నాయి.