Homeబిజినెస్​Stock Market | మూడో రోజూ నష్టాలు కంటిన్యూ..

Stock Market | మూడో రోజూ నష్టాలు కంటిన్యూ..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 324 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 129 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) ఒత్తిడికి గురవుతున్నాయి. దీంతో ప్రధాన ఇండెక్స్‌లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 324 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 129 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ రోజురోజుకు క్షీణిస్తూ వస్తుండడం, ఎఫ్‌ఐఐలు నిరంతరాయంగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, రిటైల్‌ ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతుండడంతో మన మార్కెట్లలో నష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌ (RBI MPC Meeting) బుధవారం ప్రారంభమైంది. ఇది మూడురోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 12 పాయింట్ల లాభంతో ప్రారంభమై 119 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత ప్రాఫిట్‌ బుకింగ్‌తో ఇంట్రాడే గరిష్టాలనుంచి 506 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ (Nifty) 28 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా 62 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 171 పాయింట్లు పతనమైంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 324 పాయింట్ల నష్టంతో 84,813 వద్ద, నిఫ్టీ 129 పాయింట్ల నష్టంతో 25,902 వద్ద ఉన్నాయి.

ఐటీ మినహా..

బీఎస్‌ఈలో ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల స్టాక్స్‌ ఒత్తిడికి గురవుతున్నాయి. ఐటీ ఇండెక్స్‌ 0.92 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.00 శాతం నష్టపోయింది. పీఎస్‌యూ 1.54 శాతం, ఆటో ఇండెక్స్‌ 1.20 శాతం, ఇన్‌ఫ్రా 1.12 శాతం, పవర్‌ 1.07 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 1.03 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.90 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 0.88 శాతం నష్టాలతో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.05 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.66 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.53 శాతం నష్టంతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో ఉండగా.. 23 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టీసీఎస్‌ 1.68 శాతం, ఇన్ఫోసిస్‌ 1.05 శాతం, టెక్‌ మహీంద్రా 0.61 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.38 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.19 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : బీఈఎల్‌ 1.97 శాతం, ఎస్‌బీఐ 1.81 శాతం, ఎంఅండ్‌ఎం 1.69 శాతం, టాటా స్టీల్‌ 1.46 శాతం, ఎన్టీపీసీ 1.40 శాతం నష్టాలతో ఉన్నాయి.

Must Read
Related News