అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market in Red | రూపాయి పతనం కొనసాగుతుండడం, ఎఫఐఐల అమ్మకాలకు అడ్డు లేకపోవడం, మూడో త్రైమాసికంలో కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం వంటి కారణాలతో మన మార్కెట్లు (Stock Markets)ఒత్తిడికి గురవుతున్నాయి. ప్రధాన సూచీలు వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 386 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 488 పాయింట్లు పెరిగి లాభాల బాట పట్టింది.
అయితే ఇంట్రాడే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో 1,158 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో మొదలైనా కోలుకుని 136 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 358 పాయింట్లు పడిపపోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 270 పాయింట్ల నష్టంతో 81,909 వద్ద, నిఫ్టీ (Nifty) 75 పాయింట్ల నష్టంతో 25,157 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market in Red | మిక్స్‌డ్‌గా..
బీఎసఈలో క్యాపిటల్ మార్కెట్ 1.31 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.24 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.07 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.02 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.92 శాతం, ఇండస్ట్రియల్ 0.91 శాతం, ఐటీ ఇండెక్స్ 0.61 శాతం నష్టపోయాయి. మెటల్ ఇండెక్స్ 0.52 శాతం, ఎనర్జీ 0.28 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.20 శాతం పెరిగాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.01 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.80 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.32 శాతం నష్టంతో ముగిశాయి.
Stock Market in Red | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎసఈలో నమోదైన కంపెనీలలో 1,437 కంపెనీలు లాభపడగా 2,831 స్టాక్స్ నష్టపోయాయి. 137 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 59 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 916 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 13 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top gainers..
బీఎసఈ సెన్సెక్స్‌లో 17 కంపెనీలు నష్టపోగా.. 13 లాభాలతో ముగిసింది. ఎటర్నల్ 4.98 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.57 శాతం, ఇండిగో 1.06 శాతం, రిలయన్స్ 0.75 శాతం, అదానిపోర్ట్స్ 0.70 శాతం పెరిగాయి.
Top losers..
ఐసీఐసీఐ బ్యాంక్ 1.96 శాతం, ట్రెంట్ 1.78 శాతం, బీఈఎల్ 1.59 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.22 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.18 శాతం నష్టపోయాయి.