అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టపోయింది. అయితే ప్రధాన సూచీలు ప్రారంభ నష్టాలను తగ్గించుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 102 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు (Global Markets) మిశ్రమంగా ఉన్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా పడిరది. అయితే ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 27 పైసలు బలపడడంతో మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. హెల్త్‌కేర్, టెక్నాలజీ, కన్జూమర్ డ్యూరెబుల్ సెక్టార్లలో వాల్యూ బయ్యింగ్ కనిపించింది.బుధవారం ఉదయం సెన్సెక్స్ 443 పాయింట్లు, నిఫ్టీ (Nifty) 35 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. సెన్సెక్స్ 84,617 నుంచి 85,075 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 26,067 నుంచి 26,187 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 102 పాయింట్ల నష్టంతో 84,961 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 26,140 వద్ద స్థిరపడ్డాయి.
ఐటీ సెక్టార్‌లో జోష్..
ఐటీ ఇండెక్స్ జోష్ మీదుంది. బీఎస్‌ఈలో ఐటీఈ ఇండెక్స్ 2.52 శాతం పెరిగింది. కన్జూమర్ డ్యూరెబుల్ 1.25 శాతం, హెల్త్‌కేర్ 0.42 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.41శాతం, ఇండస్ట్రియల్ 0.30 శాతం పెరిగాయి. యుటిలిటీ 0.80 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.76 శాతం, ఆటో 0.68 శాతం, టెలికాం 0.61 శాతం, ఇన్‌ఫ్రా 0.55 శాతం, రియాలిటీ 0.39 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.40 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.47 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం లాభంతో, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం నష్టంతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 2,104 కంపెనీలు లాభపడగా 2,068 స్టాక్స్ నష్టపోయాయి. 178 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 140 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 121 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభపడగా.. 17 కంపెనీలు నష్టపోయాయి. టైటాన్ 3.96 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.99 శాతం, టెక్ మహీంద్రా 1.80 శాతం, ఇన్ఫోసిస్ 1.75 శాతం, సన్‌ఫార్మా 1.30 శాతం లాభపడ్డాయి.
Top Losers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో మారుతి 2.78 శాతం, పవర్‌గ్రిడ్ 1.66 శాతం, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ 1.50 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.38 శాతం, ఆసియా పెయింట్ 1.34 శాతం నష్టపోయాయి.