అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | గ్రీన్‌లాండ్ (Green Land) స్వాధీనం విషయంలో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆ ద్వీపంలోని కీలక సైనిక స్థావరం వద్ద యుద్ధ విమానాన్ని మోహరించేందుకు సిద్ధమైనట్లు నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ చేసిన ప్రకటన ఆందోళన రేకెత్తిస్తోంది. టారిఫ్‌ల భయాలకు తోడు జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతుండడం, రూపాయి బలహీనత. ఎఫఐఐల అమ్మకాలతో మన మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి.
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 39 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 47 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 442 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ (Nifty) 5 పాయింట్ల నష్టంతో మొదలై 5 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 153 పాయింట్లు క్షీణించింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 358 పాయింట్ల నష్టంతో 82,887 వద్ద, నిఫ్టీ 128 పాయింట్ల నష్టంతో 25,457 వద్ద ఉన్నాయి.
అన్ని సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి
అన్ని సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బీఎస్ఈలో రియాలిటీ ఇండెక్స్ 2.77 శాతం పడిపోగా.. క్యాపిటల్ గూడ్స్ 1.37 శాతం, ఐటీ 1.30 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 1.24 శాతం, ఇండస్ట్రియల్ 1.17 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.16 శాతం, సర్వీసెస్ 1.12 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.03 శాతం, హెల్త్‌కేర్ 1.01 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.38 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.16 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.56 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో ఉండగా.. 23 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. హెచ్‌యూఎల్ 0.52 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.41 శాతం, ఎన్టీపీసీ 0.31 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.27 శాతం, కొటక్ బ్యాంక్ 0.21 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : బజాజ్ ఫైనాన్స్ 2.71 శాతం, టెక్ మహీంద్రా 1.98 శాతం, ఇండిగో 1.78 శాతం, ఎటర్నల్ 1.76 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.60 శాతం నష్టాలతో ఉన్నాయి.