అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | గ్రీన్ ల్యాండ్ (Greenland ) విషయంలో తలెత్తిన భౌగోళిక రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, భారత్, యూఎస్ మధ్య ట్రేడ్ డీల్ విషయంలో ట్రంప్ సానుకూల ప్రకటన చేయడంతో గురువారం స్టాక్ మార్కెట్ పాజిటివ్‌గా స్పందించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గ్యాప్‌అప్‌లో ప్రారంభమై భారీ లాభాల దిశగా సాగుతున్నట్లు కనిపించినా.. ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 550 పాయింట్ల భారీ గ్యాప్‌అప్‌లో ప్రారంభమై అక్కడినుంచి మరో 324 పాయింట్లు పెరిగింది. అయితే ఇంట్రాడే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో 909 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 991 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 267 పాయింట్లు నష్టపోయింది. చివరి గంటలో మార్కెట్లు కోలుకుని పైకి ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్ 398 పాయింట్ల లాభంతో 82,307 వద్ద, నిఫ్టీ (Nifty) 132 పాయింట్ల లాభంతో 25,289 వద్ద స్థిరపడ్డాయి.
పీఎస్‌యూలో ర్యాలీ..
బీఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.43 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.03 శాతం, ఇండస్ట్రియల్ 1.78 శాతం, పీఎస్‌యూ 1.70 శాతం, ఇన్‌ఫ్రా 1.67 శాతం, యుటిలిటీ 1.57 శాతం, సర్వీసెస్ 1.45 శాతం, పవర్ 1.43 శాతం, మెటల్ 1.34 శాతం, ఎఫఎంసీజీ 1.22 శాతం, కమోడిటీ 1.15 శాతం, హెల్త్‌కేర్ 1.11 శాతం, ఐటీ ఇండెక్స్ 0.92 శాతం లాభపడగా.. రియాలిటీ ఇండెక్స్ 0.69 శాతం, కన్యూమర్ డ్యూరెబుల్స్ 0.43 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.28 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.13 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.66 శాతం లాభాలతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,951 కంపెనీలు లాభపడగా 1,280 స్టాక్స్ నష్టపోయాయి. 154 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 69 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 276 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 11 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 24 కంపెనీలు లాభపడగా.. 6 కంపెనీలు నష్టపోయాయి. బీఈఎల్ 3.75 శాతం,టాటా స్టీల్ 2.69 శాతం, అదానిపోర్ట్ట్స్ 2.57 శాతం, ఎస్‌బీఐ 1.95 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.73 శాతం పెరిగాయి.
Top Losers : ఎటర్నల్ 2.61 శాతం, టైటాన్ 1.50 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.21 శాతం, రిలయన్స్ 0.15 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.08 శాతం నష్టపోయాయి.