అక్షరటుడే, గాంధారి: Gandhari mandal | మొక్కజొన్న లారీ అదుపు తప్పింది. ఈ ఘటన గాంధారి మండల (Gandhari mandal) కేంద్రంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కండేయ మందిర సమీపంలో చద్మల్ నుండి గాంధారికి (Chadmal to Gandhari) వస్తున్న మొక్కజొన్న లారీ అదుపుతప్పి బోల్తాకొట్టింది. దీంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఆ సమయంలో అటువైపుగా ఏ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓవర్ లోడ్‌తో ఉండడం, డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పేర్కొన్నారు.
