అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mahabubnagar | రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు (Road Accidents) కలవర పెడుతున్నాయి. ఇటీవల యాక్సిడెంట్లు పెరిగాయి. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపడుతున్నా.. ఫలితం ఉండటం లేదు.
మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో ఓ లారీ ఇథనాల్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది. హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంకర్‌ను లారీ ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఇథనాల్ ట్యాంకర్ (Ethanol Tanker) డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. లారీ డ్రైవర్‌ను స్థానికులు రక్షించారు. సమచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పి వేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది.
Mahabubnagar | డీసీఎం ఢీకొని ఇద్దరి మృతి
హన్మకొండ జిల్లా (Hanmakonda District)లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం వ్యాన్ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. వెంకటాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను యాకూబ్, వెంకట్ రెడ్డిగా గుర్తించారు.
Mahabubnagar | చలికాలంలో జాగ్రత్త
చలికాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. పొగ మంచు కారణంగా ముందు వెళ్లే వాహనాలు కనిపించవు. అలాగే చలితీవ్రతతో అద్దాలపై తేమ పేరుకుపోయి వాహనాలు సరిగా కనపడవు. దీంతో అధికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వాహనదారులు రాత్రి పూట జాగ్రత్తగా వెళ్లాలి. ఫ్రంట్, బ్యాక్ లైట్లు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. రోడ్డుపై వాహనాలు ఆపితే పార్కింగ్ లైట్లు వేయాలి.
