HomeతెలంగాణLocal Body Elections | స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.. మొదలైన నామినేషన్ల పర్వం

Local Body Elections | స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.. మొదలైన నామినేషన్ల పర్వం

Local Body Elections | రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదలైంది. తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను అధికారులు స్వీకరిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదలైంది. మొదట ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలకు ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్​ విడుదల చేసింది.

రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు తొలిదశ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్​ విడుదల అయింది. తొలివిడతలో 292 జెడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గురువారం నుంచి నామినేషన్ల (Nominations) స్వీకరణ కూడా ప్రారంభం అయింది. శనివారం వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Local Body Elections | రెండు దశల్లో..

రాష్ట్రంలోని 565 జెడ్పీటీసీలు, 5,749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈ​సీ (SEC) గతంలోనే తెలిపింది. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. మొదటి విడత ఎన్నికలు అక్టోబర్‌ 23న జరగనున్నాయి. ఈ నెల 11న నామినేషన్ల గడువు ముగుస్తుంది. 12న నామినేషన్ల పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

Local Body Elections | కోర్టు తీర్పుపై ఉత్కంఠ

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన గ్రామాల్లో ఇంకా స్థానిక ఎన్నికల సందడి ప్రారంభం కాలేదు. బీసీ రిజర్వేషన్ల​ (BC Reservations) అంశంపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు (High Court) బుధవారం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. అనతంరం గురువారానికి విచారణను వాయిదా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం మరోసారి కోర్టు వాదనలు విననుంది. కోర్టు రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు చెబితే స్థానిక ఎన్నికలు యథావిథిగా జరగనున్నాయి. ఒకవేళ రిజర్వేషన్లు చెల్లవని చెబితే మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.